Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.

తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.

by CVR NEWS
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.

కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలో ఉన్న కంచెకు హఠాత్తుగా చిన్న చిన్న బొమ్మలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు వేర్వేరు చోట్ల ఈ వింత బొమ్మలు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ బొమ్మల మిస్టరీపై తుని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగానే తామే ఆ బొమ్మలను అక్కడ ఏర్పాటు చేశామని ఎస్సై కృష్ణమాచారి స్పష్టం చేశారు. చిన్నారి అదృశ్యమైన జీడి తోటలో క్రూర జంతువుల కదలికలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సాంకేతికంగా ఈ బొమ్మలను కట్టామని ఆయన వివరించారు. ఏదేమైనప్పటికీ చిన్నారి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపులో ఈ బొమ్మల ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: