ఏపీలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం అక్కడి నర్సరీ రైతులు ఇసుక అక్రమాలను బీజేపీ, జనసేన నేతలకు వివరించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో ఇసుక సరఫరా దోచుకో, దాచుకో అనే తీరుగా మారిందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీ సంస్థ ముసుగులో ఇసుక దందా కొనసాగుతోందని విమర్శించారు. ఇసుక దందా సొమ్మంతా తాడేపల్లికి చేరుతోందని ధ్వజమెత్తారు. నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు చేపట్టవద్దని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు మే నెలతో పూర్తి అయ్యాయని, అయినా ఇష్టానుసార ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని పురందేశ్వరి మండిపడ్డారు.
Purandeshwari
ఏపీలో కుంభకోణాలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్రం నిధులతోనే అని స్పష్టం చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని తెలిపారు. రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళతాయని పురందేశ్వరి స్పష్టం చేశారు.
వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరువురు మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శల చేసుకోవడంతో ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. పురందేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయిరెడ్డికి లేదని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఒక నొటోరియస్ క్రిమినల్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా పురందేశ్వరి 9 ఏళ్లుగా పని చేయడంతో ఆమె ప్రజలకు తెలుసు విజయిసాయిరెడ్డి మాత్రం ఏ2గానే ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. అసలు విజయసాయిరెడ్డికి సంస్కారం లేదని ధ్వజమెత్తారు. పురందేశ్వరి బయటపెట్టిన వైసీసీ ప్రభుత్వ అవినీతిపై విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని సోమిరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుట్టపర్తిలో పురందేశ్వరి అధ్యక్షతన పోలింగ్ బూత్ మరియు శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. పురందేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు విధానపరమైన లోపాలను ఎత్తిచూపితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి కోవర్టు అంటారా అంటూ ప్రశ్నించారు .రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే
ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఎన్ని ఇళ్లు నిర్మించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.
టిడిపి, బిజెపి, జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని, ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని ఆమే దర్శించుకున్నారు. ఆలయ మర్యాదులతో స్వాగతం పలికి స్వామి వారి దర్శిన బాగ్యం కల్పించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపట్టాన్ని అందజేసిన ఆలయ ఈవో వెంకటేశు. తరువాత అగరంపల్లిలో బిజెపి కార్యాలయం ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలను కొనసాగుతుందని ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా…లిక్కర్, ఇసుక, మైనింగ్ లతో అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు పెడుతున్నారన్నారు పురందేశ్వరి. రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. మిగిలిన పొత్తులు సాధారణంగా ఎన్నికలు రెండు నెలలు ముందు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రాక్టర్లు పెద్దపెద్ద జేసీపీలతో నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నిజమైన సామాజిక న్యాయం చేస్తున్నది ప్రజలకు సబకే సత్, సబ్కె వికాస్ ముందుకెళ్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. ‘సంస్థాగతంగా బీజేపీని ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని ఢిల్లీ పెద్దలకూ తెలుసులేమ్మా పురందేశ్వరి. ఇసుకను గతంలో దోచుకునేవారు. ఇప్పుడు సహజవనరుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తోందని తెలుసుకోమ్మా. గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!’ అని ట్వీట్ చేశారు.
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము ముందు నుంచి తప్పుపడుతున్నామని… నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండానే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని విమర్శించారు. బాబుకు బెయిల్ రావడం మంచి పరిణామమని చెప్పారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ, ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా జేబులు నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని దుయ్యబట్టారు.




Total views : 147250