పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గత నెలలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేదించారు. కేసుకు సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 9 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ మీడియాకి తెలిపారు. తణుకు పట్టణానికి చెందిన బంగారు వ్యాపారి ఇంట్లో గత నెల 12వ తేదీన ఐదుగురు దుండగులు చొరబడి వ్యాపారితో సహా కుటుంబ సభ్యులందరినీ తాళ్లతో బంధించి చోరీకి పాల్పడ్డారు. వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్ అధికారులు ఆదేశాల మేరకు జిల్లా అధికారుల సూచనలతో తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పోలీసులు దర్యాప్తులో పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన నిందితులు ఇటువంటి చోరీలకు పాల్పడతాయని తెలిసి పోలీస్ బృందాలు మహారాష్ట్ర తరలి వెళ్లాయి. ఐదు రోజులపాటు మహారాష్ట్రలో పోలీసులు విచారించి అసలు నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ప్రధానమైన జతిన్ అనే వ్యక్తి చాలా చోరీల్లో ఆరితేరిన వ్యక్తి అని గుర్తించారు. అతనితోపాటు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు పైగా విలువైన 9 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్వపరాలను వివరించిన జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వీరిద్దరికీ సహకరించిన మరో ముగ్గురిని గతంలోనే అరెస్టు చేసినట్లు వివరించారు. తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పోలీసులు దర్యాప్తునకు మహారాష్ట్రకు చెందిన పోలీస్ అధికారులు కూడా సహకరించారని చెప్పారు. వీరందరితోపాటు ఫిర్యాదుదారుడైన బంగారం దుకాణం యజమాని సహకారం కూడా తీసుకొని కేసును చేదించగలిగామని ఎస్పీ రవి ప్రకాష్ వెల్లడించారు.
భారీ దొంగతనం..పట్టుబడ్డ నిందితులు..
154
previous post