118
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండల కొఠాలపర్రు గ్రామ అడ్డపుంతలో జరిగిన వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నర్సాపురం డీఎస్పీ రవి మనోహర్ చారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ (చివటం రామ్ ప్రసాద్)భర్తే నిందితుడుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. భార్య నందిని ప్రవర్తన పై అనుమానంతో చాకుతో పొడిచి హత్య చేశాడు. ముద్దాయిని అదుపులోకి తీసుకొని హత్య కు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకొన్నాం అన్నారు. కేసు దర్యాప్తుకు కృషి చేసిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ను సిబ్బందిని జిల్లా sp యూ. రవి ప్రకాష్, డీఎస్పీ అభినందించారు.