మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

jaggareddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని మనసులో మాట బయట పెట్టారు&period; ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పది సంవత్సరాల్లో తాను సీఎం అవుతానని అన్నారు&period; దసరా ఉత్సవాలను సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించగా&comma; ఆ వేడుకల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు&period; వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు&period; విజయదశమి నాడు తన మనసులో మాట చెబుతున్నానని అన్నారు&period; సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి&period;&period; జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని&period;&period; దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన వ్యాఖ్యలు చేశారు&period; ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ వల్ల తన నోరు&comma; చేతులు కట్టి పడేసినట్లు అయిందని&comma; లేదంటే మరిన్ని విషయాలను చెప్పే వాడినని జగ్గారెడ్డి అన్నారు&period; తాను ఎల్లప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పుకొచ్చారు&period; నియోజకవర్గంలో తాను అందుబాటులో ఉన్నా&comma; లేకపోయినా&period;&period; తన భార్యతో పాటు అనుచరులు ఉంటారని చెప్పారు&period; కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లిపోతానని అన్నారు&period; ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉండాలని జగ్గారెడ్డి కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.

కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.