చెడు వ్యసనాలకు బానిసలైన ముగ్గురు యువకులు దొంగతనాల బాట పట్టి దొరికిపోవడంతో దేహ శుద్ధిచేసి పోలీసులకు అప్పజెప్పారు స్థానికులు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రాయపేట కు చెందిన ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు లోనై డబ్బులు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. రాయపేటలో ఓ ఇంట్లో 13 కాసుల బంగారం,15 వేలు నగదు, టీవీ దొంగతనం చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడంతో అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టి వారికి దేహ శుద్ధి చేయగా వారు చేసిన దొంగతనాలు ఒప్పుకున్నారు. దీంతో స్థానికులు ముగ్గురు యువకులను నరసాపురం పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు ఆ యువకులను అదుపులో తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే నరసాపురం పట్టణంలో వీళ్ళు మరిన్ని దొంగతనాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ముగ్గురు యువకులకు దేహ శుద్ధి..
114
previous post