టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. గత ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దని తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. ఒకసారి 4 లక్షల కోట్ల మరోసారి 10 లక్షల కోట్ల అప్పు అంటున్నారని దుయ్యబట్టారు. కోవిడ్ ఇబ్బందులతోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని తెలిపారు. స్కిల్ స్కామ్ జీఎస్టీ వల్ల బయట పడిందన్నారు. 2018లోనే ఏపీ రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారని తెలిపారు. జీఎస్టీ, సెబీ, ఈడీ విచారణ చేసిన స్కామ్ అని వెల్లడించారు. 2017 నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోందన్నారు. డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారని అన్నారు. కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలని పయ్యావుల కేశవ్ కు హితవు పలికారు. రూ. 370 కోట్లకి డిజైన్ టెక్ ఈరోజుకి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదన్నారు. ఈ స్కామ్‌లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదని వెల్లడించారు.
యనమల ఆరోపణలను ఖండించిన మంత్రి బుగ్గన
80
previous post