రాహుకేతువుల రాశి మార్పు వల్ల అనేకమంది వ్యక్తుల జీవితాల్లో తీవ్రమైన మార్పులు జరుగవచ్చు. గోచారం ప్రకారం ఈనెల 30వ తేదీన జరగనున్న రాహుకేతువుల రాశి మార్పుతో ప్రధానంగా మూడు రాశులు అత్యంత శుభాలను పొందబోతున్నాయి. గోచారం ప్రకారం రాహువు మేష రాశి నుంచి మీన రాశిలోకి, కేతువు తులా రాశి నుంచి కన్యా రాశిలో ప్రవేశిస్తారు. ఇది కొన్ని రాశులవారి అంతులేని లాభాలను కురిపించనుంది. ముఖ్యంగా మూడు రాశులవారు చేపట్టే ప్రతి పని సక్సెస్ అవుతుందనటంలో సందేహం లేదు. దాదాపు 18 నెలలు ఈ రాశులవారు రాజభోగాలను అనుభవిస్తారు. ఇప్పుడు ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశివారు కెరీర్ పరంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తద్వారా ఆర్థికసమస్యలు తొలగి.జీవితం సుఖమయం అవుతుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు, వ్యాపార వృద్ధి , మరిన్ని ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణం లాభసాటిగా మారుతుంది. జీవిత భాగస్వామితో చక్కటి అనుబంధంఏర్పడుతుంది.
కర్కాటక రాశి వారు అభివృద్ధి చెందడానికి, అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ధనలాభంతో ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. అదృష్టం తోడుగా ఉండటంవల్ల చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగనున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన ధనం చేతికందుతుంది. వివాహ యోగ్యత వుంది, ప్రేమలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాదుల్లో మంచి అభివృద్ది సాద్యమవుతుంది. మీరనుకున్న కార్యక్రమాలు ఫలిస్తాయి. మేష రాశి వారి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వెతుకుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. కొత్త వెంచర్లకు అనుకూలం, నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రతీ అవకాశాన్ని నూరు శాతం అందిపుచ్చుకుంటారు. ఇది దేవుడు మీకు ఇచ్చిన బంగారు అవకాశం. ఇక మిగిలిన రాసులుకొన్నింటికి చిన్న పరిహారాలతో అత్యంత మేలు కలుగుతుంది. వాటిలో ధనసు, సింహం, వృశ్చికం, మకరం రాశులకు కలసి వస్తుంది. మిగిలిన రాశులుతగిన పరిహారాలు తప్పక
చేయించుకోవాలి.
రాహుకేతువుల వలన జీవితాల్లో మార్పులు జరుగుతాయా?
105
previous post