సూర్య,చంద్ర గ్రహణాల గురించి రుగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది. రుగ్వేదం ప్రకారం రాక్షసుడైన స్వరభానుడు.. రాహువు-కేతువులుగా ఎలా మారాడో పూర్తిగా శీదికరించబడింది. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని అమృతం కోసం మధనం చేసినప్పుడు హలాహలం, కల్పవృక్షం, కామధేనువు, మహాలక్ష్మీ,చంద్రుడు, ధన్వంతరి, అమృతం ఉద్బవించాయని మనకు తెలుసు. రాక్షసుల దృష్ఠి కేవలం అమృతంపైనే వుండటం చేత మిగిలిన వాటి విషయం వారికి పట్టలేదు. అయితే రాక్షసులు మాత్రం అమృతం కోసం గట్టిగా పట్టుబట్టారు. అప్పుడు శ్రీమహవిష్ణవు ఒక మంచి వుపాయంతో ముందుగా దేవతలకు కొద్దికొద్దగా అమృతం పోసి, మిగిలినది అంతా దానవుకు ఇస్తానని చెప్పటంతో వారు అందుకు ఒప్పుకుని తమవంతుకోసం వేచిచూస్తున్నారు. విష్ణువు మోహిని అవతారంలో రాక్షసులకు అమృతం అందకుండా దేవతలకు దాన్ని పంచుతుండగా.. స్వరభాను దాన్ని పసిగడతాడు. దేవతలైన సూర్యుడు, చంద్రుడు మధ్య కూర్చోని అమృతాన్ని తాగడం ప్రారంభిస్తాడు. వెంటనే అప్రమత్తమైన సూర్య, చంద్రులు ఈ విషయాన్ని విష్ణుమూర్తికి సంజ్ఞలద్వారా తెలియచేస్తారు. వేంటనే శ్రీహరి ఆలశ్యంచేయకుండా తన సుదర్శన చక్రంతో స్వరభానుడి తలను ఖండిస్తాడు. అప్పటికే అమృతం తాగడం మొదలుపెట్టిన స్వరభానుడు రాహువు-కేతువుగా మారి, తనకు శత్రవులైన సూర్య-చంద్రులపై పగపడతాడు. రాహువు.. సూర్యుడిని చుట్టముట్టగా.. అంధకారంగా మారుతుంది. అప్పుడు దేవతలు అత్రి మహర్షికి మొరపెట్టుకోగా.. తన మంత్ర శక్తితో అంధకారాన్ని తొలగించాడు. రాహుకేతువులు సూర్య చంద్రులని కొన్ని నిమిషాలు వారిని అడ్డుకోగలరు అంతేగానీ సూర్య-చంద్రులను ఏమి చేయలేరు. గ్రహణ సమయంలో సూర్య చంద్రులనుండి వచ్చే కిరణాలు ఈ రాహువు కేతువుల మీదగా మనకు పడతాయి. అవి ఛాయా గ్రహాలు కావున దోషం కలుగుతుంది. తినేపదార్దాలు మీద పడితే విషం గా మారతాయి. అందుకే ఆటైం లో తినకూడదు అని చెప్తారు. జాతకంలో ఈ రాహు కేతు గ్రహములు ఉంటే ఏ దోషం వస్తుందో ఆ దోషం గ్రహణం వల్ల అందరికి వస్తుంది అందుకే గ్రహణం ముందు స్నానం తరువాత స్నానం చేసి. ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకోవడం, దానాలు చెయ్యడం చెయ్యాలి. ఇలా ఆచరించటం వల్ల ఛాయాగ్రహాల ప్రభావం మనపై పడకుండా వుంటుంది.
రాహువు-కేతువు… స్వరభానుడేనా
97
previous post