96
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ఆలయం మూసివేసారు. ఆగమశాస్త్ర ప్రకారము అమ్మవారికి పంచ హారతులను నిలిపివేసి అమ్మవారి ప్రధానాలయం మరియు ఉపాలయములను అర్చకులు కవాట బంధనం చేసారు. గ్రహణకాలం అనంతరం ఆదివారం ఉదయం 3 గంటలకు అమ్మవారి ప్రధానాలయము మరియు ఉపాలయాల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నానాభిషేకములు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనము పునః ప్రారంభించబడుతుంది. ఆదివారం తెల్లవారు ఝామున నిర్వహించే ఆర్జిత సేవలు, సుప్రభాతం, వస్త్రం సేవ మరియు ఖడ్గమలార్చన నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభమయ్యే అన్ని ఆర్జిత సేవలు యధావిధిగా జరుగుతాయి.