జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నందు పుచ్చిన కుళ్ళిన కూరగాయలతో భోజనం వండుతున్న నిర్వాహకులు. విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన అనంతపురం జిల్లా గుత్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంనందు నాణ్యత పాటించడం లేదని పుచ్చిపోయిన కుళ్లిపోయిన కూరగాయలతో వంట వండి విద్యార్థులకు అందిస్తున్నారని అలా కాకుండా నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు రమేష్, వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు చేసి విద్యార్థులకు అందిస్తున్నారని తక్షణమే విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని వారు డిమాండ్ చేశారు. పుచ్చిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలతో పాఠశాలలో అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు .ఇది జగనన్న గోరుముద్దనా లేకపోతే విద్యార్థుల ప్రాణం తీసే ముద్ద అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని,నిర్వాకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వారు అధికారులకు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న సంబంధిత విద్య శాఖ అధికారులతో పాటు సిఐ వెంకటరామిరెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలలో ఇకనుంచి విద్యార్థులకు న్యాయమైన భోజనం అందిస్తామని విద్యార్థి సంఘాల నాయకులకు తెలిపారు.
విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన..
123
previous post