శివ శక్తి స్వరూపమే … శ్రీలలితా దేవి

Sri Lalitha Devi

Advertisements

&NewLine;<p>అమ్మవారి ఆరాధన విశిష్ఠతను తెల్సుకోవాలంటే ముందు అమ్మను అనుగ్రహించమని వేడుకోవాలి&period; మహాశక్తిని మనః పూర్వకంగా ప్రతి క్షణం ధ్యానించాలి&period; శక్తికి సంబంధించిన మంత్ర&comma; తంత్ర విధానం గురువుద్వారా పొందాలి&period; అమ్మవారి కోరిక మేరకుపరమేశ్వరుడు శ్రీ తంత్రమును శ్రీవిద్యగా అనుగ్రహించాడు అని పండితుల తెలియచేస్తుంటారు&period; శ్రీ దత్తాత్రేయ స్వామి వారు త్రిపుర సుందరి అమ్మవారిని ఉపాసించి కొన్నివేల శ్లోకాలతో దత్త సంహితను రచించారని అంటారు పండితులు &period; లలిత సహస్ర నామ భాష్యం మనకు భాస్కరాచార్యుల వారు అందించారు&period; ఆయన రచనలు మూడిటిని శ్రీ విద్య ప్రస్థానత్రయం గా పేర్కొంటాము&period; జగద్గురువులు&comma; వ్యాసులవారి ఆర్యాద్విశతి&comma; శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి మొదలగు అమ్మవారి స్తోత్రాలను మనకు అందించారు&period; నేడు ఆ స్తోత్రాలతోనే మనం శ్రీచక్రాన్ని పూజించి అమ్మవారి అనుగ్రహాని పొందగలుగుతున్నాం&period; అరవిందుల వారు&comma; శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు దశ మహా విద్యలు గురించి వివరించారు&period; కాళి&comma; తార&comma; త్రిపురసుందరి&comma; భువనేశ్వరి&comma; భైరవి&comma; చిన్నమస్తా&comma; ధూమవతి&comma; భగళ&comma; మాతంగి&comma; మరియు కమలాత్మిక&period; ఈ పేర్లతో అమ్మవారిని దశమహావిద్యలలో మనం ఆరాధిస్తాం &period;అమ్మ కొలువుదీరిన ప్రదేశాలు ఎన్నెన్నో ప్రసిద్ద క్షేత్రాలుగా పేరుగాంచాయి&period; మహిమలను చూపాయి&period;హిమాలయాలలో<br>ఉమాదేవి&comma; కశ్మీర్లో అంబ సరస్వతి గానూ&comma; వారణాసిలో విశాలాక్షి&comma; కన్యా కుబ్జంలో గౌరీ&comma; మహారాష్ట్రలో భవాని&comma; కలకత్తా కాళీ దేవి&comma; కన్యాకుమారి బాల&comma; మధుర లో మీనాక్షి&comma; శ్యామల&comma; మంత్రిణి గానూ&comma; జంబుకేశ్వరం అఖిలాండేశ్వరి దేవి లేదా దండిణి &comma; కాంచీపురం లో కామాక్షి లేదా మహా త్రిపుర సుందరి&comma; శృంగేరిలో శారదా దేవి&comma; మైసూరులో చాముండేశ్వరి&comma; భగవతి గా కేరళ లోనూ&comma; à°¶à°¿à°µ శక్తి స్వరూపంగా అమ్మవారు పూజలందుకుంటోంది&period; నవరాత్రులలో ప్రతి గృహంలోనూ దుర్గా లక్ష్మి సరస్వతి గా&comma; ముగ్గురమ్మల మూలపుటమ్మ గానూ పూజింపబడుతుంది శ్రీలలితా పరాభట్టారిక&period; ఏ రూపంలో అమ్మ పూజలు అందుకున్నప్పటికీ శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పినట్లుగా పరబ్రహ్మ స్వరూపంగా జగత్ ప్రసిద్ది పొందింది&period; నిజమైన సౌందర్యాన్ని చూడాలి అంటే అమ్మనే చూడాలి&period; భక్తి భావంతో చూడాలి&period; అత్యంత ప్రశాంతమైన అద్భుతమైన రూపం అమ్మది&period; ఆ అమ్మ శక్తి స్వరూపం&period; వేదాలలో ఆమెను శ్రీ సూక్తం &comma;దుర్గా సూక్తం&comma; భూ సూక్తం త్రిపుర&comma; భవానోపనిషధ్ లు&comma;ఇతర దేవీ ఉపనిషద్ లలో శివశక్తి రూపిణీ గా అభివర్ణించారు&period; నిత్యం చేసే సంధ్యా ఉపాసనలో గాయత్రీ దేవిగా కరుణిస్తుంది&period; మార్గ దర్శనం చేస్తుంది అన్ని పురాణ కథలు లో కార్య సాధన కోసం ఆమెని ప్రార్థించారు&period; కళ్యాణం కోరిన వరునితో జరగడానికి సాక్షాత్ రుక్మణీదేవి కూడా &&num;8221&semi; హరిన్ పతి సేయుమమ్మా&period;&&num;8221&semi;అంటూ వేడుకోవడం పోతన గారు అందంగా మనకు భాగవత కథలోఅందించారు&period; బ్రహ్మ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రము మరియు త్రిశతి అమ్మను ఏ విధంగా కొలవాలి&period; అని మార్గం చూపుతాయి&period; మార్కండేయ పురాణం కూడా శక్తి స్వరూపంగా లలితా దేవిని చండీ రూపంలో ఆరాధన మంచిదని అని చెప్తుంది&period; ఆగామ&comma;రహస్య&comma; సంహిత&comma;యమల&comma; అర్ణవ&comma;తంత్ర…ఇలా పరి పరి విధాల అమ్మను కొలవడం తెలిసిందే&period; ఇలా శ్రీలలితా పరాభట్టారిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్పిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.