శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి..

Advertisements

<p>ఇరాన్‌పై ఇజ్రాయెల్‌&comma; అమెరికా దాడులు&period;&period;ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది&period; ఈ నేపథ్యంలో మరో కీలక ఘటన చోటుచేసుకుంది&period; శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది&period; ఇరాన్‌కు చెందిన IRS దేనా నౌక&period;&period;ఇటీవల విశాఖలో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా&period;&period;శ్రీలంక తీరంలో దాడి చేసింది అమెరికా&period; దీంతో ఇరాన్‌ నౌక సముద్రంలో మునిగిపోయింది&period; అందులోని 140 మందికిపైగా గల్లంతయ్యారు&period; 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది&period; ఈ నౌక గాలె తీరానికి 40 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు&period;&period;ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందించింది&period;<br &sol;>&NewLine;దీంతో శ్రీలంక ఎయిర్‌ఫోర్స్‌&comma; నౌకాదళ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు&period; నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న 32 మందిని కాపాడారు&period; వారు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు&period; వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది&period;<&sol;p>&NewLine;<p>ఇక ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని&comma; ఇప్పటివరకు 87 మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు లంక అధికారులు&period; ఇరాన్‌ నౌక ప్రమాదానికి గురైన విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి పార్లమెంటులో ప్రకటించారు&period; నౌకలో దాదాపు 180 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు&period; ఐతే ఈ దాడి తామే చేశామని అమెరికా ప్రకటించింది&period; తమ జలాంతర్గామి నుంచి టోర్పెడోను ప్రయోగించి ఇరాన్‌ యుద్ధనౌకను ముంచివేశామని ఆ దేశ రక్షణశాఖా మంత్రి తెలిపారు&period; శత్రు దేశానికి చెందిన యుద్ధనౌకపై ఇలాంటి దాడి జరగడం రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇదే మొదటిసారని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాకిస్తాన్లో పుల్వామా దాడుల సూత్రధారి హతం..

యూరప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ..

హాట్ టాపిక్ గా మారిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..