టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా. చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.

Advertisements

<p>ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది&period; ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైస్కోరింగ్ సమరంలో ఇంగ్లండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి ప్రవేశించింది&period; ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెతెల్ వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ&comma; ఆఖరి ఓవర్లో రనౌట్ రూపంలో వెనుతిరగడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి&period; 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది&period; ఓపెనర్ ఫిల్ సాల్ట్ &comma; కెప్టెన్ బట్లర్ &comma; హ్యారీ బ్రూక్ త్వరగానే పెవిలియన్ చేరారు&period; ఈ దశలో జాకబ్ బెతెల్ ఒంటరి పోరాటం చేశాడు&period; భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు&comma; 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు&period; అతనికి విల్ జాక్స్ చక్కటి సహకారం అందించాడు&period; వీరిద్దరి దూకుడుతో ఒకానొక దశలో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది&period; ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా&comma; శివమ్ దూబే బౌలింగ్ కు దిగాడు&period; మొదటి బంతికే డేంజర్ మ్యాన్ బెతెల్ రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది&period; జోఫ్రా ఆర్చర్ చివర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ&comma; అప్పటికే ఆలస్యం కావడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే పరిమితమైంది&period; మొత్తమ్మీద ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది&period; భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా&comma; బుమ్రా&comma; అర్ష్‌దీప్&comma; అక్షర్&comma; వరుణ్ తలో వికెట్ పడగొట్టారు&period;<br &sol;>&NewLine;అంతకుముందు&comma; టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా&comma; భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు&period; ఓపెనర్ సంజు శాంసన్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు&period; కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు&comma; 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు&period; మరోవైపు ఇషాన్ కిషన్&comma; శివమ్ దూబే దూకుడుగా ఆడగా&comma; చివర్లో తిలక్ వర్మ &comma; హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది&period; ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 61 పరుగులు సమర్పించుకోగా&comma; జాక్స్&comma; రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు&period; ఈ విజయంతో భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది&period; టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది&period; 2024లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది&period; ఇక&comma; టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా&&num;8230&semi;&period; న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది&period; ఈ టైటిల్ సమరం మార్చి 8à°¨ అహ్మదాబాద్ లో జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

ముంబైపై 4 వికెట్ల విజయంతో KKR ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది..

సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి..