మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మంత్రరూపిణిగా మన మనస్సులలో కొలువైన మణిద్వీపనివాసిని మణిద్వీపవర్ణన పారాయణం సర్వశుభప్రదం, ఐశ్వర్యప్రదం, ఆయురారోగ్యప్రదం. ఎలాంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అందిస్తుంది మణిద్వీపవర్ణన పారాయణం. కరుణామయి శ్రీలలితాపరాభట్టారిక శక్తులను, ఆ తల్లి నివాసాన్ని వర్ణించే మణిద్వీపవర్ణన మన నివాసాల్లో పారాయణం చేస్తే సకల మనకు శుభాలు కలిగి సంతోషంగా వుంటాము. కొత్తగా గృహం నిర్మించటానికి సిద్దంచేసుకున్న స్థలాల్లో గానీ, లేక గృహ నిర్మాణం జరిగినతర్వాత గృహప్రవేశ కాలంలో గానీ.. ఏడాది లోపు గానీ.. ఆ ఇంట “మణిద్వీప పారాయణం” చేయడం మంచిది. ఇది సకల వాస్తు దోషాలను హరిస్తుంది. మనలో వున్న ప్రతికూలశక్తులను తొలగిస్తుంది, మన గ్రహదోషాలను పరిహరిస్తుంది. మనజీవితం ఉన్నతంగా వుండటానికి దారిచూపేది మణిద్వీపవర్ణన. మణి ద్వీపవర్ణన పారాయణం ఫల శృతిచెప్పాలంటే.. పదునాలుగు లోకాలకు పరంజ్యోతి అను మణిద్వీప నివాసిని “పరమేశ్వరి”ని తొమ్మిది విధాలుగా స్తుతించుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రము వ్రాయబడింది. అమ్మకు ప్రీతికరమైన సంఖ్య 9 కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతీ రోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారము నాడు పూజా విధానం ప్రకారం పూజించి తొమ్మిది మార్లు గానం లేదా పారాయణం చేసినచో ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్దులతో ఆయురారో ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. గృహప్రవేశ సమయంలో పారాయణ చేస్తే భూత, ప్రేత, పిశాచాది దుష్ట గ్రహాలన్నీ పారిపోతాయి. ఇతరుల నరఘోష, శత్రువుల దుష్ట ప్రయత్నాలు తొలగిపోతాయి. జయం లభిస్తుంది. ఇంతటి మహోత్తమైన విషయాలు ఎందులోనూ లేవు… ఇది శాస్త్ర వచనం.. పెద్దల మాట.
శ్రీలలితా త్రిపుర సుందరి మహాశక్తి..
133
previous post