77
ఏలూరు జిల్లా నూజివీడులో అనధికార అనుమతులతో, ప్రమాదపు అంచుల్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై సీవీఆర్ కథనంపై సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర స్పందించారు. అనంతరం ఎగ్జిబిషన్ ను పరిశీలించి నివేదిక సమర్పించాలని నూజివీడు మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ ను ఆదేశించారు. దీంతో మణికంఠ ట్రేడ్ ఎగ్జిబిషన్ ను తనిఖీ చేశారు అధికారుల బృందం. నిబంధన మీరి నిర్వహిస్తున్న ఆటల స్థలాలను, ఫుడ్ స్టాల్స్ ను, ఫైర్ సేఫ్టీ లోపాలను పరిశీలించి. సబ్ కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్.