ఎన్నికల హామీలులో భాగంగా పదివేల అరవై ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అన్నారు. దీనికి సంబంధించి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటించామని చెప్పారు . జగన్ అధికారంలోకి వచ్చి జాబ్ క్యాలెండర్‌ను ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కానీ, ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొన్నారు . నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కచ్చితంగా నెరవేరుస్తామని మంత్రి సవిత అన్నారు.
andhra pradesh
తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామని పేర్కొంది. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించింది. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామన్న సుప్రీంకోర్టు.. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించారు. మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం.
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు కట్టకూడదని అభ్యంతరం పెడితే ఎలా? ఇలాంటి ఆలోచనా విధానం వల్లే సమస్యలొస్తున్నాయని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అటవీశాఖ అధికారులు ప్రతిదానికీ అడ్డంకులు పెడుతున్నారని, ఏ పనీ ముందుకు సాగనివ్వడం లేదని కొందరు కలెక్టర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి తీరుపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి.
విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ..విశాఖపట్నం ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌గా మారుతోందని వారికి వివరించారు లోకేష్. దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే విశాఖలో ప్రారంభం కానున్నాయని తెలిపిన మంత్రి…ఇప్పటికే TCS, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తుచేశారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటం ఐటీ ఎకో సిస్టమ్‌కు మరింత బలాన్నిస్తుందని వెల్లడించారు. విశాఖలో కనీసం 20 వేల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించారు.
మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఐమాన్ ఇజ్జత్. 1967లో పారిస్ కేంద్రంగా ప్రారంభమైన తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.4 లక్షల మంది ఉద్యోగుల్లో, దాదాపు 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారని వెల్లడించారాయన. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై సహా 13 భారతీయ నగరాల్లో క్యాప్ జెమినీ కార్యకలాపాలు సాగిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించారు. ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో వ్యవసాయం కోసం అత్యున్నత సంస్థ తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయన్నారు. పేదల కోసమే కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. స్వచ్ఛాంధ్రపై సీరియస్‌గా ఉండాలని, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్సు చేస్తున్నామని సీఎం తెలిపారు. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఎలాంటి నిబంధనలు అడ్డంకిగా ఉన్నా వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ పాలనలో ట్రూఅప్ పేరిట విద్యుత్ ఛార్జీల భారం వేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూడౌన్ చేశామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సైన్స్. టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం వేదికగా చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 55 అజెండా అంశాలపై మంత్రిమండలి చర్చించింది. అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాలలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే సోలార్, హైడ్రో, హైబ్రిడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది.
ఇక కేబినెట్ భేటీలో భాగంగా విశాఖపట్నంలో రూ.2,387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ఖరారుపై కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ప్రతిపాదనకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ధ్రువీకరణ పత్రాలు ఉన్న దివ్యాంగులకు బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను ఫిబ్రవరి 28వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆరోజు అసెంబ్లీకి సెలవు ఇవ్వనున్నారు.
చిత్తూరు జిల్లా, పుత్తూరు | Huge Liquor Dump
పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్. సుమారు 250 కేసుల మధ్యంను ఒక ప్రైవేటు కళాశాలలో డంప్ చేసిన వైసీపీ నాయకులు. ఈ రోజు నగరిలో రోజా నామినేషన్ ఉండడంతో రాత్రి ఒంటిగంటకు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ పట్టుబడిన పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు. కేసు లేకుండా చేసేందుకు పోలీసుల పై రాత్రి నుంచి తీవ్ర ఒత్తిడి చేస్తున్న మంత్రి రోజా. నారాయణవనం పోలీసుల అదుపులో నిందితుడు. ఇంకా కేసు నమోదు చేయని పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్…
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా(Srikakulam)…
విజయనగరం జిల్లా రాజాం మండలం, పొగిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీ లు. పాలఖండ్యం నుండి రాజాం వెళ్తున్న ఒక కారులో భారీగా నగదు లభ్యం.. 5,23,300 రూపాయలు ను స్వాదీనం చేసుకున్న పోలీసులు.. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీన పరుచుకొని రాజాం పోలీస్ స్టేషన్ కు తరలింపు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పొగిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు.. భారీ నగదు పట్టివేత
రిజర్వాయర్లలో నీటి(Water) నిల్వలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన..
దేశానికి తాగునీటి గండం పొంచి ఉంది. రిజర్వాయర్ల(Reservoirs)లో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్న బెంగళూరు(Bangalore) దుస్థితి దేశానికి మొత్తం రానున్నదా అనే భయం ప్రజల్లో నెలకొంది. నిరుడు వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పోవడం ఇందుకు కారణమని సంబంధిత అధికారులు చెప్తున్నారు. తాగునీటి అవసరాలు రోజురోజుకు పెరుగుతుంటే అందుకు భిన్నంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న 150 రిజర్వాయర్లలో 38 శాతం మాత్రమే నీటి నిల్వలు..
దేశ వ్యాప్తంగా ఉన్న 150 రిజర్వాయర్లలో నీటిమట్టం మొత్తం సామర్థ్యంలో 38 శాతం మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇది దశాబ్దపు సగటుకంటే తక్కువ కావడం రాబోయే నీటిగండం ముప్పును సూచిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో వాటర్ స్టోరేజీ దారుణంగా పడిపోతున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 42 ప్రాజెక్టులుండగా వీటి స్టోరేజీ కెపాసిటీ తగ్గుముఖం పట్టింది. దీంతో ఈ వేసవిలో బెంగళూరు తరహా నీటి ఎద్దడి తప్పకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: భగవంత్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule):
రానున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎలక్షన్ కమిషన్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Election)తో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ను ప్రకటించనుంది. కొత్తగా బాధ్యతల్లోకి వచ్చిన ఇద్దరు కమిషనర్లతో కలిసి రేపు మధ్యాహ్నం ఢిల్లీలో షెడ్యూల్ ను చీఫ్ ఎలక్షన్ కమిగనర్ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరుగుతాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి




Total views : 38468