Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.

by CVR NEWS

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించారు. ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ తరహాలో వ్యవసాయం కోసం అత్యున్నత సంస్థ తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయన్నారు. పేదల కోసమే కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. స్వచ్ఛాంధ్రపై సీరియస్‌గా ఉండాలని, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్సు చేస్తున్నామని సీఎం తెలిపారు. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఎలాంటి నిబంధనలు అడ్డంకిగా ఉన్నా వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ పాలనలో ట్రూఅప్‌ పేరిట విద్యుత్‌ ఛార్జీల భారం వేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూడౌన్‌ చేశామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు మరింత తగ్గిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

018660
Total views : 89114

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.