130
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు మండలం ఈశ్వర పబ్లిక్ స్కూల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో ఈశ్వర కాన్వెంట్ ముందు అయ్యప్ప స్వాములు, ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు ఆందోళనకు పాల్పడ్డారు. అయ్యప్ప మాల వేసుకున్నందుకు విద్యార్థి నాగ మనోహర్ ను ప్రిన్సిపల్ శ్రీమన్నారాయణ దుర్భాషలాడారు. ప్రిన్సిపల్ మతం మారడం వల్లే అయ్యప్ప మాల వేసుకున్న తన కుమారుడు మనోహర్ ను దూషిస్తూ హేళన చేసినట్లు తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ను ధార్మిక సంఘ నేతలు చుట్టుముట్టారు. స్కూల్ లైసెన్స్ రద్దు చెయ్యాలని, ప్రిన్సిపల్ వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే వరకూ ఆందోళన విరమించేది లేదని హిందూ సంఘాల వారు పట్టుపట్టారు.