హైదరాబాద్ లోని మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం…

Advertisements

<p>హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలోని మైత్రీవనం వద్ద అగ్నిప్రమాదం జరిగింది&period; నీలగిరి బ్లాక్ భవనంలో నాల్గవ అంతస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma; అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; ఇన్ స్టిట్యూట్ లో చిక్కుకున్న విద్యార్థులను బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు&period; ఇన్ స్టిట్యూట్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది&period; స్టూడెంట్స్&comma; ఉద్యోగులు ఆ భవనం వద్దకు చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు&period; భవనం కింద అంతా వ్యాపార సముదాయాలు ఉండటం&comma; బిల్డింగ్ అంతటా భారీ హోర్డింగ్స్ ఉండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది&period; ఎవరైనా ప్రమాద వశాత్తూ కిందపడినా గాయాలు కాకుండా ఉండేందుకు సేఫ్టీ నెట్ ను పరిచారు&period; కోచింగ్ సెంటర్ ఎంట్రీ&comma; ఎగ్జిట్ పాయింట్ల నుంచి విద్యార్థులను బయటకు తీసుకొచ్చే వీల్లేకపోవడంతో&period;&period; పెద్ద పెద్ద నిచ్చెనలతో బాల్కనీ నుంచి విద్యార్థులను కిందికి దించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.