హైదరాబాద్ FSL అగ్నిప్రమాదంలో కీలక మలుపు…

Advertisements

<p>నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాద కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది&period; తాజాగా ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫైల్స్ పై నాగ్ పూర్ స్పెషల్ టీమ్ కీలక ప్రకటన చేసింది&period; మొత్తం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించామని పేర్కొంది&period; దగ్ధమైన ఫైల్స్ ను రికవరీకి ప్రయత్నించామని&comma; డేటా రికవరీ చేయడం సాధ్యం కాదని తేల్చేసింది&period; ఫిబ్రవరి 7వ తేదీన నాంపల్లిలోని FSL భవనం మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరగ్గా&period;&period; 50 కంప్యూటర్లు&comma; తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను పొందుపరిచి సీజ్ చేసిన హార్డ్ డిస్కులు దగ్ధమైనట్లు నాగ్ పూర్ స్పెషల్ టీమ్ రిపోర్టులో తెలిపింది&period; దగ్ధమైన ఫైల్స్ లో ఒక కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది&period; రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా కాలి బూడిదైనట్లు తెలిపింది&period; దగ్ధమైన ఫైల్స్ లో ఏమేమి ఉన్నాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.