95
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం పోలీసులు గంజాయి ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. గంగవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా గంజాయి అమ్మకాలు ఎక్కువైనట్లు తమ దృష్టికి వచ్చినట్లు దీంతో ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. కొంతమంది యువకులు గంజాయి అమ్ముతుండగా పట్టుకుని విచారించగా వీరు బయట ప్రాంతాల నుండి గంజాయి తెప్పించి అమ్ముతున్నట్లు తేలిందన్నారు. ఈ కేసులో 5 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 10 కేజీల గంజాయి, 60 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.