నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని 100 పడకల ఏరియా ఆసుపత్రి..

Advertisements

<p>నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన కీలక కేంద్రంగా ఉన్నప్పటికీ&comma; ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ముఖ్యంగా ప్రసూతి సేవల కోసం వచ్చే మహిళలకు అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ&comma; వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ట్రామా కేర్ సెంటర్&comma; బ్లడ్ బ్యాంక్&comma; బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పరికరాలు కూడా సక్రమంగా ఉపయోగించడంలేదని ఆరోపిస్తున్నారు&period;ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయకపోవడం&comma; రోగులను తరలించడానికి అవసరమైన వీల్‌చైర్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి&period; రాత్రి సమయంలో దోమల సమస్య అధికంగా ఉండటం&comma; విద్యుత్ సరఫరాలో లోపాలు&comma; జనరేటర్ సదుపాయాల లోపం పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తున్నాయి&period; అంతేకాకుండా&comma; అవసరమైన సిబ్బంది లేకపోవడం వల్ల సేవలు సరిగా అందడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period;ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని సౌకర్యాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే&comma; అచ్చంపేట నియోజకవర్గంలోని దూరప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు&period;<br &sol;>&NewLine;అచ్చంపేటలోని దవాఖానలో పరిస్థితులపై అక్కడ ఉన్న డాక్టర్లు స్పందించారు &period;సమస్యలు ఉన్నమాట వాస్తవమే అని ఒప్పుకుంటూ పరిష్కారానికి కృషిచేస్తున్నామని చెబుతున్నారు &period;<br &sol;>&NewLine;ఇక నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు రోగులకు ఇబ్బందికరంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; చుట్టుపక్కల గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చే ప్రజలకు సరైన చికిత్స అందకపోవడంతో&comma; వారిని నాగర్ కర్నూల్ లేదా మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రులకు పంపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; కనీస సౌకర్యాలు లేకపోవడం&comma; అవసరమైన వైద్య సిబ్బంది కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; ముఖ్యంగా కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన మాతా-శిశు రక్షక కేంద్రం కూడా అధ్వాన స్థితిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది&period; గర్భిణీ లకు వారానికి ఒక్కరోజే డెలివరీ సేవలు అందిస్తున్నారని&comma; నీటి వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేవని బాధితులు చెబుతున్నారు&period;డయాలసిస్ రోగులకు అవసరమైన యంత్రాలకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడం&comma; చిన్నపిల్లల వైద్యులు&comma; గైనకాలజిస్టులు&comma; ఓపీ డాక్టర్లు లేకపోవడం వంటి సమస్యలు ఆసుపత్రి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి&period; కోట్ల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రిని ఇలా నిర్లక్ష్యం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.