64
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గానుగపెంట పంచాయతీ, బావిరంగన్న చెరువు గ్రామాల మధ్య ఉన్న చెరువులగుట్ట వద్ద కోడి పందేలు ఆడుతున్నారని సమాచారం రావడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పాకాల సి.ఐ ఓబులేష్, తన సిబ్బందితో కోడిపందెం ఆడుతున్న స్థావరాలపై దాడి చేసి 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వారి వద్దనున్న 1,13,300 రూపాయలు, పందెం కోళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే కొంతమంది పారిపోవడం జరిగింది, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు.
Read Also..