30 ఏళ్ల యువకుడు కారుణ్య మరణం పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.

Advertisements

<p>దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది&period; రాణాకు చికిత్స నిలిపివేయొచ్చని పేర్కొన్న న్యాయస్థానం&period;&period; అతడి కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది&period; &period; తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువరించింది&period;<&sol;p>&NewLine;<p>దిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా 2013 ఆగస్టు 20à°¨ చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు&period; నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది&period; శరీరం కదలలేని స్థితికి చేరుకుంది&period; ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా&comma; అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు&period; అప్పటినుంచి అతడు కోమాలోనే ఉండిపోయాడు&period; ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి హరీశ్‌ను చూసుకుంటున్నారు&period; కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా&comma; మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా&period;&period; వారి పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది&period; ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది&period; అయితే&comma; హరీశ్‌ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో అతడి కుటుంబం మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది&period; మెడికల్‌ రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు&period;&period; హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది&period; ఈ ఏడాది జనవరి 13à°¨ అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు&period; మానవీయకోణంలో మర్యాదపూర్వక చావును ప్రసాదించాలని అప్పుడు వారు కోర్టును వేడుకున్నారు&period; ఆ సందర్భంగా ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం తాము పరిశీలిస్తామంటూ తీర్పు రిజర్వ్ చేసింది&period; తాజాగా కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

AIADMKకు మరో షాక్.

భారత్‌కి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం అలర్ట్.

సెషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన.