ఉలవపాడు శాఖ గ్రంథాలయంలో సోమవారం 56 వ జాతీయ వార్షకోత్సవాలలో భాగంగా ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిలుగా ఎల్.చెంచమ్మ ఎంపీడీఓ ఎం .ప్రసాదరావు ఎం ఈ ఓ , కె .శివనాగేశ్వరరావు హెడ్మాస్టర్ , పివి .సుధాకర్ రావు టీచర్, జె .జీవన్ జ్యోతి టీచర్. పాల్గొన్నారు.ముందుగా ఎంపీడీఓ చెంచమ్మ మాట్లాడుతూ పిల్లలు చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి అని మన గ్రంధాలయంలో చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి.విద్యార్థులు ఎక్కువుగా గ్రంధాలయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.సభలో పాల్గొన్న వక్తలు అందరూ విద్యార్థులకు మంచి సందేశం అందించారు.అనంతరం ఈ వారం రోజుల పాటు జరిగిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన 265 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ వారం పాటు జరిగిన కార్యక్రమాలకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన అన్నీ పాఠశాలలు యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఇన్ని బహుమతులు అందించటానికి ముఖ్య దాత స్టేట్స్ లో ఉంటున్న నా బాల్య మిత్రుడు జానకి భోగినేని వారి పెద్ద అన్నయ్య చెంచు రామానాయుడు భోగినేని వారితో కలిసి బహుమతులు అందించారు.వీరికి గ్రంధపాలకుడు ప్రేత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
గ్రంథాలయంలో 56 వ జాతీయ వార్షకోత్సవాలు..
62
previous post