స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అత్యవసర పిటిషన్ దాఖలుకు హైకోర్టు నిరాకరించింది. వ్యాజ్యం దాఖలుకు అనుమతినిచ్చి అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. తనకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు సైతం నివేదికలు ఇచ్చారని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్లో ఎడమ కంటి శుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు. సెప్టెంబరులోపు కుడి కంటికి సైతం చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారన్నారు. ప్రస్తుతం కుడి కంటి చూపు మందగించిన కారణంగా అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరమని వివరించారు. జాప్యం చేస్తే చూపు పూర్తిగా మందగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై కంటి వైద్య నిపుణులు ఈనెల 21న ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచారు. మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ విచారణ జరపనుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణ జాబితాలోకి వచ్చింది. చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో సీఐడీ అధికారులు ఎవరితో మాట్లాడారు, వారి ఫోన్ కాల్ డేటా రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ పిటిషన్పై సీఐడీ కౌంటర్ దాఖలుచేసింది. కాల్ డేటా బయటకు వెల్లడించడం వల్ల దర్యాప్తు అధికారుల భద్రతకు నష్టం కలుగుతుందన్నారు. గోప్యతకు భంగం కలుగుతుందని పేర్కొంది. చంద్రబాబును అరెస్టు చేసి సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో తమ అనుమతి లేకుండా మీడియా. వీడియో, ఫోటోలు తీసుకుందన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు
109
previous post