గద్వాల ప్రాంతానికి ఘన చరిత్ర ఉందని, ఇక్కడ వాల్మీకి, బోయ సోదరులు ఎక్కువగా ఉంటారని, ఆంధ్రాలో వారు ఎస్టీలని, ఇక్కడ మాత్రం బీసీలని అన్నారు. మన రాష్ట్రంలోనూ వాల్మీకి, బోయ తెగలను ఎస్టీల్లో కలిపేందుకు తాను ప్రయత్నించినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, అయినా ఫలితం లేదని చెప్పారు. గద్వాలలో నిర్వహించిన BRS ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలకు అన్యాయం చేశారు. ఆంధ్రాలో ఎస్టీల్లో పెట్టి.. ఇక్కడ బీసీల్లో చేర్చి అన్యాయం చేశారు. ఆనాడు వాల్మీకి, బోయలను ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రే. ఆర్డీఎస్ కాలువను ఆగం పట్టించిన పార్టీ కాంగ్రెస్సే అని కేసీఆర్ అన్నారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న BRS అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఆర్డీఎస్ కాలువను ఆగం పట్టించిన పార్టీ కాంగ్రెస్సే- కేసీఆర్
85
previous post