పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా కుంకుమార్చన సేవ, బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, జెఈఓ వీరబ్రహ్మం ,డిప్యూటీ ఈవో గోవిందరాజులు , ఆలయ అర్చకులు బాబు స్వామి ,ఆగమ సలహాదారు శ్రీనివాసచార్యులు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు..
117
previous post