101
ఏఏజీ, సీఐడీ చీఫ్ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎంపీ రఘురామ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ను సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ విచారించారు. అయితే నాట్ బిఫోర్ మీ.. అంటూ జస్టిస్ రఘునందన్ విచారణ నుంచి తప్పుకొన్నారు. దీంతో రఘురామ పిటిషన్‌ను ఏ బెంబ్ విచారించాలో సీజే మళ్లీ నిర్ణయించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏఏజీ, సీఐడీ చీఫ్ మీడియా సమావేశాలు నిర్వహించారని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ గతంలో పిల్ వేశారు.