సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తో కలిసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నామినేషన్ పత్రాలతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో అక్కడే ఉన్న హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆర్వో కార్యాలయానికి తరలి వెళ్లారు. ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014 కు ముందు ఉన్న పరిస్థితి, ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని, మార్పును ప్రజలు గమనించాలన్నారు.
ఒకప్పుడు కరువు కాటకాలతో మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ లో ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగి సంతోషంగా, సుభిక్షంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, తనను కూడా మూడో సారి గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
మూడో సారి కూడా కేసీఆర్ ని గెలిపించండి – ఎమ్మెల్యే సతీష్
101
previous post