Chat bot ద్వారా పోగొట్టుకున్న 300 సెల్ ఫోన్ లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ ఎస్పీ సుధాకర్ తెలిపారు. గురువారం పోలీసు అతి దగ్గరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా క్రైమ్ సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో CHAT BOT లొ వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా తనిఖీలు నిర్వహించి, పోగొట్టుకున్న 300 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో ప్రధాన భూమిక పోషించిన క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎవరైనా వారి సెల్ ఫోన్లను పోగొట్టుకుంటే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు ప్రతిసాత్మకంగా చేపట్టిన CHAT BOT ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, సకాలంలో వారి సెల్ఫోన్లను బాధితులకు అప్పగిస్తామని తెలిపారు.
300 సెల్ ఫోన్ల రికవరీ..
148
previous post