ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ(పురుషులు) టోర్నమెంట్ 2023 ఉత్సహపూరిత వాతావరణంలో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9,10,11,12 తేదీల్లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు దక్షిణాది ఆరు రాష్ట్రాలకు చెందిన 113 యూనివర్సిటీలకు చెందిన 95 టీమ్ లు, సుమారు 1200 మంది ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొని మార్చ్ పాస్ట్ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి. శ్రీమతి ఆర్.కె.రోజా గౌరవ వందనం స్వీకరించారు. జె.ఎన్.టి.యు.కె మరియు ఆదిత్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైస్ చాన్సలర్ ప్రో.జి.వి.ఆర్.ప్రసాద్ రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రో. హేమచంద్రారెడ్డి, నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె.పద్మ రాజు, ఇండియన్ యూనివర్సిటీస్ జాయింట్ సెక్రటరీ డా. బల్జీత్ సింగ్ సేఖోన్ ఆదిత్య విద్యాసంస్థల అధినేత డా. నల్లమిల్లి శేషారెడ్డి,వైస్ చైర్మన్ డా నల్లమిల్లి సతీష్ రెడ్డి, ఎన్.వి.రమణ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇజ్జపురెడ్డి ప్రసాదరావు(కబాడ్డి రావు), ప్రో.ఎన్.సుమలత, డా . జి.వి.రాజు, శ్యామ్, తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జి . వి.ఆర్. ప్రసాదరాజు కార్యక్రమం యొక్క నిర్వాహకులకు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రసాద రావు మాట్లాడుతూ భారతదేశంలో క్రికెట్ తర్వాత అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రీడ కబడ్డీ అని అన్నారు. కబడ్డీ అనేది భారతీయ సంస్కృతిలో భాగం అని ఈ క్రీడకు ప్రభుత్వం తరుపున ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి రోజా ను కోరారు. ప్రో.హేమచంద్ర రెడ్డి మాట్లాడుతూ జే. ఎన్ టి యూ కే నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు ఆదిత్య విద్యా సంస్థల చేరికతో వేరే లెవెల్ కు కలర్ ఫుల్ ఈవెంట్ గా మారిపోయాయి అని అన్నారు.సంయుక్త ముఖ్య అతిథి గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి.ఆర్.కే.రోజా మాట్లాడుతూ ప్రో కబడ్డీ స్థాయిలో ఆదిత్య యాజమాన్యం చేసిన ఏర్పాట్లుతో ఈ పోటీలకు మరింత స్థాయికి చేర్చారు. కబడ్డీ చిన్నతనం నుండి ఎంతో ఇష్టం అని ఆటలో గెలిస్తెనే చరిత్రలో ఉంటామని అలా చరిత్ర సృష్టించడానికి వందశాతం ప్రయత్నించాలని అన్నారు.గెలుపు ఓటమి రెండూ మూడక్షరాలే అయితే గెలుపు ఇచ్చే కిక్ వెరే లెవెల్ అని అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎందరో క్రీడాకారులు చరితలో నిలిచారని అలా మీరు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అందుకు ఇటువంటి వేదికలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న సంగతి వివరించారు.డిసెంబర్ లో రాష్ట్ర మంతటా ఆడుదాం ఆంధ్రా పేరిట ప్రతీ సచివాలయం పరిధిలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి అన్నారు. అనంతరం బెలూన్లు వదిలి పోటీలను ప్రంభిస్తున్నట్లుప్రకటించి స్వయంగా కబడ్డీ ఆడి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్ కె రోజా చేతులమీదుగా “కబడ్డీ” పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆదిత్య యాజమాన్యం తరుపున ఎన్.శ్రుతి రెడ్డి, డా . ఎన్. సుగుణ రెడ్డి మంతి రోజాను ఘనంగా సన్మానించారు.
సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలు..
73
previous post