తిరుపతిలో క్రికెట్ క్రీడాభిమానులకు ఆంద్రా క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా బాయ్స్, అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ వారు తీపి కబురు అందించారు. ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు అతిపెద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర క్రీడా మైదానంలో మధ్యాహ్నం 1 గంటల నుంచి మ్యాచ్ ముగిసేంత వరకు నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 12 అడుగుల ఎత్తు 36 అడుగుల వెడల్పు కలిగిన అతి పెద్ద స్క్రీన్ లు, డీజే సౌండ్స్ అండ్ లైటింగ్ ఏర్పాటు చేశామని, ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ పోటీలను అభిమానులు అందరూ ప్రశాంతంగా వీక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సుమారు 7 వేల నుంచి 10 వేల మంది ఒకే చోటు నుంచి క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అక్కడకు వచ్చిన క్రికెట్ అభిమానులు అందరికీ ఉచిత ప్రవేశం, రాత్రి భోజనం ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆనందంగా క్రికెట్ మ్యాచ్ వీక్షించాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక ఆహ్వానితులు తుడా చైర్మన్ చెవి రెడ్డి మోహిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు
బిగ్ స్క్రీన్ పై భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్..
63
previous post