మంచిర్యాల జిల్లా మందమర్రిలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని జరగబోవు ఎన్నికలలో రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఐ ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి శ్రీనివాస్ ఈ రోజు విలేకరుల సమావేశంలో తెలిపారు. టీ.శ్రీనివాస్ మాట్లాడుతు….పేదలకు మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి వంటివి వారి కార్యకర్తలకు మత్రమే ఇచ్చుకున్నారు తప్ప పేద ప్రజలకు ఇచ్చింది లేదని పల్లె ప్రగతి వనాలని క్రీడా ప్రగాణాలని డంప్యాడ్లని దళిత భూములను గుంజుకున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రజా ప్రతినిధులు అమ్ముకున్నారు తప్ప పేదవానికి ఒక గుంట జాగ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ కార్మికులు రైతాంగం ప్రజలు తలరాతలు మారుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందని అన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తెలంగాణ ఉద్యమ సమయంలో స్వచ్ఛందంగా పాల్గొని పోరాటం చేసిన కార్మికులను పర్మినెంట్ చేస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరిని కూడా పర్మినెంట్ చేయలేదని సూచించారు. సింగరేణి పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని కొత్త బొగ్గు బావులు తవ్వి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఒక్క భూగర్భ బావిని తవ్వలేదని ఓసీలనే ప్రోత్సహిస్తూ జన సందోహానికి ఆటంకం కలిగిస్తున్నారు తప్ప కొత్త బావులు తవ్వట్లేదని తెలిపారు ఈ సమావేశం లొ పట్టణ ఇఫ్ట్ iftu జాఫర్ నాయకులు పాల్గొన్నారు.
Read Also..