ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని విద్యానగర్ రోడ్డులో రతికంటి ప్రభాకర్ రావు ఇంటిలో భారీ చోరి జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులకొట్టి 15 లక్షల విలువైన బంగారం, వెండి, ఆభరణాలతో పాటు 01 లక్ష 50 వేలు నగదు దోచుకెళ్లారు. ఈ నెల 19 వతేదిన కార్తీక మాసం లో ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా పంచారామ క్షేత్రాలు దర్శనం కోసం రతికంటి ప్రభాకర్ రావు కుటుంబం తన ఇంటికి తాళం వేసి యాత్రకు వెళ్ళారు. యాత్ర ముగించుకుని 21 వ తేదీన ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచి ఉండటంతో షాక్ కు గురైనారు. ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు కూడా తెరచి ఉండటం, దాచివుంచిన 250 గ్రాముల బంగారం, 1500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 01 లక్ష 50 వేలు నగదు ను గుర్తు తెలియని దొంగలు అపహరించుకు పోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు పిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..