రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26 నవంబర్ మరియు 27 తేదీలలో తిరుపతి జిల్లా కు విచ్చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కే ఎస్ జవహర్ రెడ్డి డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి తదితర రాష్ట్ర అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ టీటీడీ ఈఓ తదితరులతో వర్చువల్ విధానంలో సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షించి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరావతి నుండి వర్చువల్ విధానంలో భారత ప్రధాన మంత్రి తిరుపతి జిల్లా పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించగా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జె.సి డి కె బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ భారత ప్రధాని తిరుపతి ఇంటర్నేషనల్ విమానాశ్రయం దగ్గర దిగినప్పటి నుండి తిరుగు ప్రయాణం వరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని, సంబంధిత అధికారుల సమన్వయ సమావేశం నిన్ననే నిర్వహించి విధులు కేటాయించామని తెలిపారు. ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, 108, సేఫ్ రూమ్, తదితరాలు ఏర్పాటు, అలాగే ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ ఏర్పాటు, తగినంత లైటింగ్ ఏర్పాటు, రవాణా శాఖ వాహనాల ఫిట్నెస్ చెక్, కమ్యూనికేషన్ ప్లాన్ ఇంటర్నెట్ టెలిఫోన్ సదుపాయాలు, శానిటేషన్ ఏర్పాట్లు, అవసరమైన చోట బ్యారికెడింగ్, రోడ్డు మరమ్మత్తులు చేపట్టడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. భారత ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ రానున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏర్పాట్ల కొరకు అధికారులకు విధులు కేటాయించామని అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. టీటీడీ ఈఓ మాట్లాడుతూ భారత ప్రధాని తిరుమల చేరుకున్నపటి నుండి వారికి వారి సిబ్బందికి, సిఎం, గవర్నర్ గారికి వసతి, ఆహారం, దర్శనం అన్నీ ప్రణాళికా బద్ధంగా చేపడతామని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ తగినంత బందోబస్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తిరుపతిలో మోడీ పర్యటన..
66
previous post