పి.వి నర్సింహారావు లాంటి గొప్ప వ్యక్తికి కేంద్రంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ భారత రత్న ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎంపి బండి సంజయ్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని మాజీ ప్రధాని, భారత రత్నపి.వి నర్సింహారావు నివాసానికి వెళ్లిన బండి సంజయ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పి.వి వల్లే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మనుగడ ఉందని, కానీ పి.వి కి అంత్యక్రియలు కూడా జరపకుండా అవమానించడానికి కారణం ఇప్పటి వరకు తెలియడం లేదన్నారు. ఇప్పటి వరకు కూడా పి వి విషయంలో దుర్మార్గపు ఆలోచనలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఒక్క పి.వి విషయంలో మాత్రమే కాదు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు అంతేనన్నారు. మొన్నటి దాకా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ది కూడా అదే ధోరణి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మహనీయులను, వాళ్ళ పేర్లను వాడుకొని రాజకీయం చేయడం తప్ప.. వాళ్ళను గుర్తించి చేసింది ఏమి లేదని విమర్శించారు.
Naredra Modi
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. విపక్షాలు చాలా కాలం పాటు విపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని మోదీ ఎద్దేవా చేశారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని భావిస్తున్నా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని మోదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతి పక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయని ఎత్తిపొడిచారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, కానీ మన విపక్షాల తీరు పట్ల దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందారని మోదీ పేర్కొన్నారు. జాతి మొత్తం ఆరోగ్యకరమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటోందని, నేటి విపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే జవాబుదారీ అని స్పష్టం చేశారు. వారసత్వం అనేది కాంగ్రెస్ దుకాణం మూసివేతకు కారణమవుతోందని అన్నారు. పార్లమెంటులో ఉన్నంతకాలం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించాలని మోదీ హితవు పలికారు. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలకు సాంత పార్టీలు ఏమీ లేవని… కానీ కాంగ్రెస్ లో వారసత్వ పాలనకు ఖర్గే, ఆజాద్ వంటి వారు బాధితులయ్యారని విమర్శించారు. ఆజాద్ ఏకంగా పార్టీని వదిలి వెళ్లారని వివరించారు. ఒకే నేతను కాంగ్రెస్ అదే పనిగా జనంపై రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. Read Also..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్ని అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కదన రంగంలోకి దూకబోతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. మొట్టమొదటి బహిరంగ సభను బిహార్‌లో నిర్వహించబోతున్నారు. బిహార్‌లోని చంపారన్ జిల్లా బేటియా సిటీలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అదేవిధంగా బిహార్‌లో పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపాయి. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలను గెలుచుకొనేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో బేటియా, బెగూసరాయ్, ఔరంగాబాద్ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. బిహార్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఈరోజు కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్తులను అమ్మడమే కాకుండా ప్రైవేట్ పరం చేయడం జరిగింది. మన దేశంలో ఒకే ఒక ఎయిర్ లైన్స్ గవర్నమెంట్ నుండి వుండే ఎయిర్ ఇండియా ఇప్పుడు దాన్ని కూడా ప్రవేట్ పరం చేయడం జరిగింది. ఆయన కోరుట్ల కు వచ్చి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని మాటలు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి కోసం మాత్రం వచ్చి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాడట దేశంలో ఉన్నాయన్నీ మాత్రం అమ్ముతాడట ఆయన మాటలు నమ్మ సౌఖ్యంగా లేవు అంటూ చురకలు అంటించడం జరిగింది.
రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26 నవంబర్ మరియు 27 తేదీలలో తిరుపతి జిల్లా కు విచ్చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కే ఎస్ జవహర్ రెడ్డి డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి తదితర రాష్ట్ర అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ టీటీడీ ఈఓ తదితరులతో వర్చువల్ విధానంలో సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షించి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరావతి నుండి వర్చువల్ విధానంలో భారత ప్రధాన మంత్రి తిరుపతి జిల్లా పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించగా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జె.సి డి కె బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ భారత ప్రధాని తిరుపతి ఇంటర్నేషనల్ విమానాశ్రయం దగ్గర దిగినప్పటి నుండి తిరుగు ప్రయాణం వరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని, సంబంధిత అధికారుల సమన్వయ సమావేశం నిన్ననే నిర్వహించి విధులు కేటాయించామని తెలిపారు. ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, 108, సేఫ్ రూమ్, తదితరాలు ఏర్పాటు, అలాగే ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ ఏర్పాటు, తగినంత లైటింగ్ ఏర్పాటు, రవాణా శాఖ వాహనాల ఫిట్నెస్ చెక్, కమ్యూనికేషన్ ప్లాన్ ఇంటర్నెట్ టెలిఫోన్ సదుపాయాలు, శానిటేషన్ ఏర్పాట్లు, అవసరమైన చోట బ్యారికెడింగ్, రోడ్డు మరమ్మత్తులు చేపట్టడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. భారత ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ రానున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏర్పాట్ల కొరకు అధికారులకు విధులు కేటాయించామని అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. టీటీడీ ఈఓ మాట్లాడుతూ భారత ప్రధాని తిరుమల చేరుకున్నపటి నుండి వారికి వారి సిబ్బందికి, సిఎం, గవర్నర్ గారికి వసతి, ఆహారం, దర్శనం అన్నీ ప్రణాళికా బద్ధంగా చేపడతామని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ తగినంత బందోబస్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.




Total views : 147249