రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో మళ్లీ తొలి అడుగుపడింది. రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభమైన యాత్రకు జనం పోటెత్తారు. తాటిపాక సెంటర్‌లో జరిగిన బహిరంగ సభకు జనం సునామీలా వచ్చారు. కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంఘీభావంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. లోకేశ్ మాట్లాడుతూ తనపై ఆరు కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్రను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చంద్రబాబును జైలుకు పంపితే తన పాదయాత్ర ఆగుతుందని భ్రమపడ్డారని ఎద్దేవా చేశారు. స్కిల్ ఖాతాలో ఒక్క ఆధారమైనా చూపించలేకపోయారని ధ్వజమెత్తారు.
లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర పునఃప్రారంభం
63