85
కేరళలో కొత్తగా కొవిడ్-19 జేఎన్.1 సబ్‌వేరియంట్ వెలుగు చూసింది. 79 ఏళ్ల వృద్ధురాలిలో ఈ సబ్‌వేరియంట్ బయటపడింది. భారత సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం నిర్వహించిన పరిశీలనలో వృద్ధురాలు కొత్త సబ్ వేరియంట్ బారిన పడ్డట్టు తేలింది. ‘‘నవంబర్ 19న నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో ఆమెకు కొవిడ్ సోకినట్టు తేలింది. ఆ నమూనాలో జేఎన్.1 సబ్‌వేరియంట్ ఉన్నట్టు ఈ నెల 8న తేలింది. ఈ సబ్‌వేరియంట్ తొలిసారిగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో వెలుగు చూసింది’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా సహా పలు దేశాల్లో జేఎన్.1 కేసులు పెరుగుతున్నప్పటికీ టీకాలు, చికిత్సలతో ఈ ఉపరకం నుంచి రక్షణ పొందొచ్చు.
Read Also..
Read Also..