పుత్తూరు డిఎస్పి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, తిరుపతి జిల్లా సత్యవేడు మండలం అమాసిరెడ్డి కండ్రిగలో గల ఓ ప్రైవేటు ఎర్రచందనం నిల్వ ఉంచే లైసెన్స్ కలిగిన గోడౌన్లో సిబ్బందిపై దాడి చేసారు. అక్కడ నుండి ఎర్రచందనం దుంగలు లారీలో వేసుకొని పరారవుతూ ఉండగా దాసు కుప్పం సమీపంలో వారిని వెంబడించి సినీ ఫకీలో మా పోలీసులు నిన్నటి దినం ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారన్నారు. ముద్దాయిలు 19 మంది ఉండగా వీరిలో 16 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపుతున్నామని మిగిలిన ముగ్గురిని పట్టుకోవాల్సి ఉందని వాళ్ళు పరారీలో ఉన్నారని త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళనాడుకు చెందిన చంద్రశేఖర్ అనే పోలీసు మరియు నాగరాజన్ అనే రైల్వే ఎంప్లాయ్ కూడా ఉన్నారన్నారు. వారి వద్ద నుండి దాదాపు 50 లక్షల రూపాయల నగదు, 46 చందనం దుంగలు ఒక ఈచర్ లారీ రెండు కార్లు 14 సెల్ ఫోన్లు 18,000 రూపాయల నగదు కత్తి స్ప్రే బాటిల్ దారాలు సీసీ కెమెరాల డ్రైవ్ స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఐ శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ నాగార్జున్ రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డిలు రెండు బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా ఈ స్మగ్లర్లను పట్టుకున్నారని వారిని అభినందించారు. అదేవిధంగా సత్యవేడు అటివిశాఖ ఎఫ్ఆర్ఓ ఆయన బృందం కూడా పూర్తిగా సహకారం అందించి కార్యక్రమంలో పాల్గొన్నారని వారిని కూడా అభినందించారు.
Read Also..