బాపట్ల జిల్లా కంకటపాలెం గ్రామంలోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. దేవస్థానంలోని హుండీ తో పాటు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు దొంగతనానికి గురి అయినట్లు ఆలయ పూజారి బాపట్ల శేషగిరిరావు తెలిపారు.
సోమవారం వేకువజామున ఆలయం తెరవడానికి వచ్చిన పూజారి కి తాళాలు పగలగొట్టి ఉండటం తో గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. గ్రామ పెద్దలతో కలిసి పూజారి ఆలయం లోపలికి ప్రవేశించి దొంగతనానికి గురి అయిన వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో అమ్మవారి చీరెలు అమ్మగా వచ్చిన 15000 రూపాయలు కూడా హుండీలోనే వేశామని పూజారి చెబుతున్నారు. అమ్మవారి బంగారు కాసుల పేరుతో పాటు కళ్ళు, చెవులు మిగిలిన ఆభరణాలు, ఛటారితో సహా అపహరణ కు గురయ్యాయన్నారు. షుమారు పది లక్షల రూపాయలకు పైగా ఆభరణాల విలువ ఉంటుంది అంటున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు సవాలుగా ఉంది.
దేవస్థానంలో చోరీ..
61
previous post