అన్నమయ్య జిల్లాలో జ్యూస్ అనుకుని పొరపాటున ఇద్దరు చిన్నారులు విషం తాగేసిన సంఘటన శనివారం రాత్రి గుర్రంకొండ మండలంలో వెలుగు చూసింది. విషం తాగిన చిన్నారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. పిల్లల తల్లిదండ్రుల కథనం మేరకు.. తంబళ్లపల్లి నియోజకవర్గం, బీరంగి కొత్తకోట మండలం, చెరువు ముందరపల్లెకు చెందిన దంపతులు గంగరాజు, లక్ష్మిదేవిల కుమార్తె ప్రియదర్శిని(05), గుర్రంకొండ మండలంలోని బంధువులు నగేష్, రవణమ్మ ల ఇంటికి వెళ్లారు. నగేష్ పొలం వద్ద ఉండగా వారిని పలకరించడానికి గంగరాజు, లక్ష్మీదేవిలు తన కుమార్తె ప్రియదర్శిని, నగేష్ కుమార్తె జ్ఞానిక (03) ఇంటి వద్ద వదలిపెట్టి పొలం వద్దకు వెళ్లారు. ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలు పొరపాటున జ్యూస్ అనుకుని పురుగు మందు తాగేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలను పొలం నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గుర్తించి అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు వారికి మెరుగైన వైద్యం అందించిన ప్రియదర్శిని పరిస్థితి మరింత విషమించిందని డాక్టర్లు ఆ ఇద్దరి చిన్నారులను తిరుపతి రుయాకు రెఫర్ చేయడంతో 108 సిబ్బంది వారిని తిరుపతి రుయాకు తరలించారు.
జ్యూస్ అనుకుని విషం తాగిన చిన్నారులు..
95
previous post