ఈ దుంపలో కేలరీలు, ప్రోటీన్స్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ సి, ఐరన్, థయామిన్, ఫొలేట్, విటమిన్ బి 6, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్‌లు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులోని ఐరన్ జీవక్రియ, శారీరక పనులకి హెల్ప్ చేస్తుంది. బరువు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ ఫుడ్‌ని తీసుకోవచ్చు. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. హెల్దీ గట్ బ్యాక్టీరియాని ప్రోత్సహించే ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్‌ని అందిస్తుంది. పేగుల్లోని విషపదర్థాలని గ్రహించి జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. ఈ దుంపని తీసుకోవడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మెటబాలిజంని పెంచి జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. ఈ కర్రపెండలాన్ని రెగ్యులర్‌గా తింటే రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో పాటు ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, షుగర్, గుండె సమస్యలు తగ్గుతాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, ఫైబర్ మెటబాలిక్ సిండ్రోమ్, సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.