Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home National Bihar Assembly | ఎన్డీఏ సర్కారుకు బలపరీక్ష..

Bihar Assembly | ఎన్డీఏ సర్కారుకు బలపరీక్ష..

by Rama
Nithish Kumar

Bihar Assembly:

బీహార్ అసెంబ్లీలో నేడు జేడీయూ చీఫ్‌ నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గయాలోని మహాబోధి రిసార్ట్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు…ఇప్పటికే ప్రత్యేక బస్సులో పట్నాకు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ కేవలం 43 స్థానాలనే గెలుచుకుంది. బీజేపీ దాని ఇతర మిత్రపక్షాలు 82 స్థానాల్లో విజయం సాధించాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడంతో నితీశ్‌కుమార్‌ సీఎంగా ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత నితీశ్‌ బీజేపీతో విభేదించి ఆర్జేడీతో కలిసి మరోసారి సీఎంగా మహాకూటమి సర్కారును ఏర్పాటు చేశారు. తాజాగా ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మళ్లీ బీజేపీ పంచన చేరారు. మళ్లీ ఎన్డీఏ కూటమి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్‌.. నేడు బలపరీక్ష ఎదుర్కోబోతున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీ 75, కాంగ్రెస్‌ 19, సీపీఐ (ఎంఎల్‌) 12 తో కలిపి మహాకూటమి బలం 110గా ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. ఎన్డీఏ కూటమికి బీజేపీ 74, జేడీయూ 43తో కలిపి 125 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. Read Also..

Advertisements

You may also like

Our Visitor

036138
Total views : 181011

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.