Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh పాయకరావుపేటలో హోం మంత్రి , ఆర్ అండ్ బీ మంత్రివిస్తృత పర్యటన.

పాయకరావుపేటలో హోం మంత్రి , ఆర్ అండ్ బీ మంత్రివిస్తృత పర్యటన.

by CVR NEWS
పాయకరావుపేటలో హోం మంత్రి , ఆర్ అండ్ బీ మంత్రివిస్తృత పర్యటన

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది. నక్కపల్లి మండలం బోయపాడు, దొండవాక తీరాల్లో నిర్మించనున్న రెండు ప్రతిష్టాత్మక ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు హోం మంత్రి వంగలపూడి అనిత, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, గత రెండేళ్లలోనే నియోజకవర్గాన్ని సుమారు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని వెల్లడించారు. రాష్ట్రానికి మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వస్తే, అందులో రెండు పాయకరావుపేటకే తీసుకువచ్చినట్లు ఆమె గర్వంగా ప్రకటించారు. మరోవైపు ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపించే నాయకురాలు అనిత అని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, గత పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు,

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: