Monday, June 29, 2026
News Navigation
Monday, June 29, 2026
News Navigation

Breaking

Monday, June 29, 2026
Home International ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు.

ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు.

by CVR NEWS
ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు

ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇరాన్‌తో ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత.. అమెరికా ప్రతినిధులు స్టీవ్‌ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ తమ దేశంలో పర్యటిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు పుతిన్‌. గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్-పుతిన్ మధ్య అలస్కాలో చర్చలు జరిగాయి. వాటి గురించి మాట్లాడిన పుతిన్‌..ఒప్పందాలు కుదరకపోయినా.. గతంలో చర్చించిన అంశాలపై చర్చలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఇదిలాఉంటే.. కొంతకాలంగా రష్యా ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ దాడులు చేస్తోంది. దీంతో రష్యాకు చెందిన పలు చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతిన్నాయి. ఈ దాడులతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని తొలిసారి పుతిన్ అంగీకరించారు. చమురు కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఉత్పత్తి పెంచుతామని వెల్లడించారు. మరోవైపు, ఈ దాడులపై మాట్లాడిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ..‘రష్యా సామర్థ్యాన్ని బలహీనపరిచే ఆపరేషన్లను కొనసాగిస్తామంటున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

035631
Total views : 180027

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.