Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News సెషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన.

సెషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన.

by CVR NEWS
సెషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్‌లో ఘన స్వాగతం లభించింది. సీషెల్స్ జాతీయ దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్న ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ, కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికి గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించారు. భారత్-సీషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా భూమిపై ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన ‘జోనాథన్’ అనే ఆల్డబ్రా జెయింట్ తాబేలును ప్రధాని మోదీ సందర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 194 ఏళ్ల వయస్సు కలిగిన ఈ తాబేలు జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: