Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన.

by CVR NEWS
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ప్రజాప్రభుత్వం ఎక్కడా అభివృద్ధిని కుంటుపడనీయకుండా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మండలంలోని రాజారంపేటలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాలను ప్రభుత్వం అందించిందని గుర్తుచేశారు. ప్రభుత్వంపై కారుకూతలు కూసే వారికి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, రాబోయే రోజుల్లోనూ అదే పునరావృతమవుతుందని విపక్షాలపై మండిపడ్డారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: