Monday, June 29, 2026
News Navigation
Monday, June 29, 2026
News Navigation

Breaking

Monday, June 29, 2026
Home Latest News AIADMKకు మరో షాక్.

AIADMKకు మరో షాక్.

by CVR NEWS
AIADMKకు మరో షాక్

తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేల రాజీనామా పర్వం కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలో టీవీకే నేతృత్వంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు AIADMK ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా అదే బాటలో మరో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. AIADMK పార్టీకి చెందిన కరూర్ ఎమ్మెల్యే, మాజీ రవాణా శాఖ మంత్రి ఎం.ఆర్. విజయ భాస్కర్ ఇవాళ రాజీనామా చేశారు. ఈ ఉదయం రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్‌ను కలిసిన విజయభాస్కర్.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తాజా పరిణామాల నేపథ్యంలో AIADMK అధినేత ఎడప్పాడి పళనిస్వామికి ఇబ్బందులు తప్పడం లేదు. రెండు నెలల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత AIADMK నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వైదొలుగుతుండటం సంచలనంగా మారింది. తొలుత విజయ్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఏకంగా 25 మంది టీవీకేకు సపోర్టు చేయగా అందులోని వారు క్రమంగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారంతా అధికార టీవీకేలో చేరగా విజయ భాస్కర్ కూడా అదే బాటలో పయనిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

035631
Total views : 180028

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.